షారుఖ్ మూడు బాషల్లో తండ్రయ్యాడు

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ అన్నీ బాషల్లో తండ్రయ్యాడు. అలాగని ఆయన రాష్ట్రానికో ఫ్యామిలీ మెంటైన్ చేస్తున్నాడని అనుకోవద్దు. పిల్లల ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ యాప్‌ కోసం షారుక్‌ ఈ వినూత్న ప్రకటనలో నటించారు. ఇందులో షారుక్‌ దక్షణాది, గుజరాతీ, బెంగాలీ ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన తండ్రుల గెటప్‌లు ధరించారు.

ఈ ప్రకటనలో గెటప్స్‌తోనే కాదు, ఆ గెటప్‌కు తగ్గట్టుగా ప్రాంతీయ యాసలతో సంభాషణలు కూడా షారుక్ చక్కగా పలికారు. ఇప్పుడీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో రెండు లక్షలకు మందికి పైగా వీక్షించారు. ఇది చూసి షారుఖ్ ఇన్నిసార్లు తండ్రియ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం షారుక్‌ ఆనంద్‌ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జీరో’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ హీరోయిన్స్ గా నటించారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.