బీజేపీ ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ కుట్ర ?

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణలో ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నకిలీ పాస్ పోర్టు కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ అవకతవకల కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నోటీసులు అందాయి.

ఆగస్టు 15న అనుమతి లేకుండా ‘తిరంగా జెండా’ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనపై ఐదు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాజాసింగ్ కు అబిడ్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐతే, ఇదంతా రాజకీయ కుట్ర. ఎఐఎం ఒత్తిడి మేరకే తనపై ర్రాష్ట్ర ప్రభుత్వం అక్రమకేసులు బనాయిస్తుందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.

ఇక, అటు బీజేపీని ఇటు ఎంఐఎం పార్టీ సంకలో పెట్టుకొని రాజకీయాలు చేయడం కేసీఆర్ కే చెల్లింది. కేంద్రంలో థర్డ్ ఫ్రెంట్ కోసం ప్రయత్నాలు చేసిన కేసీఆర్ భాజాపాతో మంచి సంబంధాలని కలిగి ఉన్నారు. ముందస్తుకు వెళ్లే ముందు పలుమార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. ముందస్తు కోసం ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రంగంలోకి దిగాడనే ప్రచారం ఉంది.

అలాంటప్పుడు టీఆర్ఎస్ ఎందుకు రాజాసింగ్ ని టార్గెట్ చేసినట్టు ? అన్నది అంతు చిక్కడం లేదు. మరోవైపు, మా మద్దతు కేసీఆర్ కు.. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతరు అంటోంది మజ్లిస్. ఏదేమైనా.. భాజాపా, ఎంఐఎంలతో కేసీఆర్ కొనసాగిస్తున్న స్నేహాన్ని మెచ్చుకోవాల్సిందే.