నాని బొజ్జగణపతి అయ్యాడు

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. ఇందులో విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ‘బిగ్‌బాగ్‌ గణపతి’ కొలువుదీరాడు. కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చొన్న గణపతి విగ్రహం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే నానిని బొజ్జగణపతిని చేశారు. కాకపోతే.. బొజ్జ పెట్టలేదు. నానికి కూడా బొజ్జలేదుగా… !

పలు చోట్ల ‘బిగ్‌బాస్‌’ థీమ్‌తో ఏర్పాటు చేసిన వినాయక పందిళ్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక, కౌశల్‌ ఆర్మీ పేరుతో ఒక వినాయక మండపాన్నే ఏర్పాటు చేయటం విశేషం. ‘బిగ్‌బాస్‌ 2’లో వినాయక పూజా మహోత్సవాలు అంటూ మరో మండపం ఆకట్టుకుంటోంది.
మొత్తంగా.. వినాయకుడు నవరాత్రోత్సవాల్లో బిగ్ బాస్ క్రేజీ కనిపిస్తోంది. ఇక, ప్రస్తుతం బిగ్‌బాగ్‌ హౌస్‌లో కౌశల్‌, గీత, అమిత్‌, రోల్‌రైడా, తనిష్‌, దీప్తి, సామ్రాట్‌లు మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేత అవుతారో వేచి చూడాలి.