‘మహాభారతం’పై నమ్మకం లేదట

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్’కు ‘మహాభారతం’పై నమ్మకం లేదట. ‘మహాభారతం’ అమీర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ విషయాన్ని ఆయనలు పలు వేదికలపై చెప్పారు. ఇందులో కర్ణుడి పాత్రలో నటించాలని ఉందని తెలిపారు. ఐతే, ఇప్పుడా అవకాశం వచ్చిన వదులుకొన్నట్టు సమాచారమ్.

దాదాపు రూ. 1000కోట్ల బడ్జెట్ తో ‘మహాభారతం’ ప్రాజెక్టు కోసం సన్నాహాలు మొదలయ్యాయి. మూడు భాగాలుగా ‘మహాభారతం’ తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు ముఖేష్ అంబానీ నిర్మించబోతున్నారు. ఓ చైనీస్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇందులో ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలొచ్చాయ్. ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ గురించి షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.

ఈ ప్రాజెక్టు నుంచి అమీర్ ఖాన్ తప్పుకొన్నాడట. ‘మహాభారతం’ మూడు భాగాలుగా తీయాలంటే కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. పైగా రూ.1000 కోట్ల బడ్జెట్ కూడా సరిపోక పోవచ్చు. ఇదీగాక, ఈ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాకపోవచ్చని అమీర్ భావిస్తున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. మరీ.. అమీర్ తప్పుకోవడంతో.. ఈ రూ.1000కోట్ల ‘మహాభారతం’ని ఆపేస్తారా.. ? లేదంటే అమీర్ లేకుండానే మహాభారతం రాబోతుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.