నాగ్ హీరోయిన్ హాయ్ చెప్పింది !

కింగ్ నాగార్జున హీరోయిన్ ఆకాంక్ష సింగ్ హాయ్ చెప్పింది. నాగ్, నానిల మల్టీస్టారర్ ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్ష, రష్మిక మందన హీరోయిన్లు. వీరిలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు. తాజాగా, సినిమాలో జాహ్నవి (ఆకాంక్ష సింగ్) ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.

దీనికి సంబంధించిన పోస్టర్ ని నాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. “చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి !! యాయ్ రొమాన్స్ అగైన్” అనే కామెంట్ పెట్టాడు. దీంతో.. దేవ రొమాంట్ గా కనిపించబోతున్నాడనే విషయం అర్థమవుతోంది. ఇక, మిగిలింది దాసు (నాని) హీరోయిన్ రష్మిక మందన లుక్ రావాల్సి ఉంది.

తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది. ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. ఈ నెల 27న దేవదాస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.