బన్నీ సినిమాతో మారుతికి నష్టాలు.. !
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో దర్శకుడు మారుతి నష్టపోయారు. ఐతే, దర్శకుడుగా మాత్రం కాదు. డిస్ట్రిబ్యూటర్ గా. గతంలో మారుతి సినిమా డిస్ట్రిబ్యూటర్ గానూ పని చేసిన విషయం తెలిసిందే. మారుతి, యూవీ క్రియేషన్స్ వంశీ, బన్నీ వాసులు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్లు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ వీరికి మంచి లాభాలు తెచ్చిపెట్టిందట.
ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో మారుతి చెప్పారు. ఆ తర్వాత నష్టాలు కూడా వచ్చాయట. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ సినిమా ‘హ్యాపీ’ మారుతి అండ్ కో కి నష్టాలు మిగిల్చిందట. ఇక, అప్పటి నుంచి ఇంకొద్దురా బాబోయ్ ఈ సినిమా బిజినెస్
అని ఆపేశాడట మారుతి. ఇక, మారుతి తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది.