‘అనుపమ.. హాట్’గా ఉంది !

అనుపమ హాట్’గా ఉందంటున్నాడు రామ్. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో రామ్‌-అనుపమల మధ్య చూపించిన సన్నివేశం భలే సరదాగా ఉంది. టీజర్‌ను చూస్తే ఈ చిత్రాన్ని రొమాంటిక్‌ ప్రేమకథగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

అప్పుడే స్నానం చేసి.. చీర కట్టుకున్న అనుపమ జుట్టుకి సాంబ్రాణి వేసుకుంటుండగా, వెనుక నుంచి రామ్‌ ఆమెను చూసి మైమరచిపోతాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య వచ్చే సంభాషణ కాస్త చిలిపిగా, కాస్త రొమాంటిక్‌గా ఉంది. ఆ హాట్ సీన్ ని మీరు చూసేయండీ.. !