షాక్ : ఆస్తమాతో బాధపడుతున్న ప్రియాంక

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఆస్తమాతో బాధపడుతోంది. ఐదేళ్ల వయసు నుంచే ఆమెకు ఆస్తమా ఉందట. ఇప్పుడీ విషయాన్ని ప్రియాంక సోషల్‌మీడియా ద్వారా తెలిపి అందరిని షాక్ కి గురి చేసింది. ఇప్పుడే ఈ విషయం ప్రియాంక ఎందుకు చెప్పింది ?అంటే.. ఆమె సిప్లా కంపెనీకి చెందిన ఇన్హేలర్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ‘బేరోక్‌ జిందగీ’ పేరిట ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇందులో ‘నా గురించి బాగా తెలిసినవారందరికీ నాకు ఆస్తమా ఉందని తెలుసు. ఐదేళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నా. అమ్మ వైద్యురాలు కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకోవడం కంటే ఇన్హేలర్‌ వాడటం మంచిదని సూచించింది. ఇన్హేలర్‌ జీవితాంతం ఓ అలవాటుగా మారుతుందేమోనని అందరూ సందేహపడ్డారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇన్హేలర్‌ అలవాటు అవ్వదు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం అలవాటు అవుతుంది. ఇందులో దాపరికం ఏముంది? ఆస్తమా నన్ను అదుపు చేసేలోపే నేను దాన్ని అదుపుచేయాలనుకున్నాను. నా వద్ద ఇన్హేలర్‌ ఉన్నంత వరకు జీవితంలో నన్ను ఎదగనివ్వకుండా ఆస్తమా నన్ను ఆపలేదు’ అని వెల్లడించారు ప్రియాంక.