‘యు టర్న్’ కోసం సమంత ఎంత తీసుకుందో తెలుసా ?
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం “యు టర్న్’. పవన్ కుమార్ దర్శకుడు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యు టర్న్’కి రిమేక్ ఇది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఇంతకీ ఈ చిత్రం సామ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా ? రూ. 3.8కోట్లు. ఇది ముందుగా మాట్లాడుకొన్న రెమ్యూనరేషన్ కాదు. అసలు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సామ్ నటించింది. కాకపోతే.. ప్రీ-రిలీజ్ బిజినెస్ లో షేర్ తీసుకొంది. ఇందులో సామ్ వాట రూ. 3.8కోట్ల అని తెలిసిందే. ఈ సినిమా నిర్మించింది సామ్ స్నేహితులే. అందుకే ఎలాంటి రెమ్యూనరేషన్ ఆశించకుండా లాభాల్లో మాత్రమే షేర్ తీసుకొంది.
గతంలో సామ్ ఒక్కో సినిమాకి రూ. కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకొనేది. ఇప్పుడీ యు టర్న్ కోసం సామ్ ట్రిపుల్ గిట్టుబాటు అయ్యిందని చెప్పవచ్చు. ఇక, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో సామ్ నటనతో కట్టిపడేసింది. ఇక మీదట కూడా ఆమె నుంచి మరిన్ని లేడీ ఓరియెటెండ్ సినిమాలు రావడానికి యు టర్న్ గట్టి పునాది వేసిందని చెప్పవచ్చు.