ఎంపీ కవితని తప్పుపట్టిన శ్రీరెడ్డి

టాలీవుడ్, కోలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన వివాదాస్పదన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఆమె ఏకంగా ఎంపీ కవితని తప్పు పట్టింది. ఎంపీ కవిత మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, సమంత సినిమాల గురించి మాట్లాడతారు. కానీ, మహిళల అంశాలను పట్టించుకోకపోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు.

హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూం భవన్‌లో మంగళవారం శ్రీరెడ్డి, మహిళా సంఘం నేతలు సంధ్య, కె.రమ (పీవోడబ్ల్యు), ఎస్‌.ఎల్‌.పద్మ (ఐఎఫ్‌టీయూ), తేజస్విని కలిసి మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కన్నా ఆర్థిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యకరం. ఇది మహిళలను అవమానించమేనని శ్రీరెడ్డి అన్నారు. కాగా, ఇటీవల ‘మా’లో ఆర్థిక లావాదేవీలపై శివాజీరాజా, నరేష్‌ మధ్య వివాదం చెలరేగడం.. దాన్ని రెండ్రోజుల్లోనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.