తాత పేరు నెలబెడతా
తాత ‘అక్కినేని నాగేశ్వరరావు’ పేరు నిలబెడతా అంటున్నాడు అఖిల్ అక్కినేని. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అక్కినేని ఓ శకం. తెలుగు సినీపరిశ్రమ తొలితరం సూపర్ స్టార్స్ ఎంతో మందికి సాధ్యం కాని చరిత్ర అక్కినేని సొంతం. 75 ఏళ్ల పాటు సినీ కళామతల్లి సేవలోనే తరించారు. నేడు ఆయన 94వ జయంతి. ఈ సందర్భంగా.. తారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు అఖిల్.
“హ్యాపీ బర్త్ డే తాతా .. అక్కినేని అనే పేరును ప్రతిరోజు తలచుకుంటూనే వుంటాను. అక్కినేని అనే ఇంటిపేరును. నట వారసత్వాన్ని మాకు ఇచ్చావు. అది ఒక ఘనతగా నేను భావిస్తున్నాను. మీ పేరును నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. లవ్ ఫర్ ఎవర్ .. మిమ్మల్ని మిస్ అవుతున్నాము .. ఏఎన్నార్ లివ్స్ ఆన్” అంటూ అఖిల్ ట్విట్ చేశారు.
ఇక, వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమాగా ‘మిస్టర్ మజ్ను’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్. అక్కినేని జయంతి కానుకగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్ రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు. బహుశా.. ‘మన్మథుడు’ వారసుడు అనిపించుకోవడానికే.. ఈ ప్రయత్నంగా కనిపిస్తోంది.