అందుకే నాగ్ ‘దేవ’దాస్ అయ్యాడు

నాగ్-నానిల మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 27న ‘దేవదాస్’లు ప్రేక్షకుల ముందుకురానున్నారు.

గురువారం హైదరాబాద్’లో ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఒప్పుకోవడానికి మూడు కారణాలున్నాయి. ఒకటి స్క్రిప్టు. రెండోది వైజంతీ మూవీస్. మూడోది నాని అని చెప్పారు. మల్టీస్టారర్ సినిమా చేస్తే నానితో కలిసి చేయాలని అనుకొన్నా.. ఇప్పుడదే జరిగింది. సినిమాలో నవ్వులే నవ్వులు.. చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

ఇక, ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై చలసాని అశ్వినిదత్ నిర్మించారు.