అఖిల్’లో మహేష్ కనిపించాడు

అఖిల్ అక్కినేని.. అసలు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ డమ్ సంపాదించుకొన్నాడు. ఆ సమయంలో తెలుగు తెరకు మరో మహేష్ బాబు రాబోతున్నాడు. హీరోగా అక్కినేని ప్రిన్స్ అదరగొట్టడం ఖాయమనే కామెంట్స్ వినిపించాయి. సూపర్ స్టార్ మహేష్ కూడా ఓ సందర్భంలో అఖిల్ అందంగా ఉంటాడు. ఆయన్ని తెరపై చూడ్డానికి నేను ఆతృతగా ఎదురు చూస్తున్నా అన్నారు.

తీరా అఖిల్ అక్కినేని చేసిన తొలి చిత్రం ‘అఖిల్’ అట్టర్ ప్లాప్ అయ్యింది. రెండో సినిమా ‘హలో’ యావరేజ్ గా మిగిలింది. ఈ రెండు సినిమాల్లోనూ అఖిల్ మరీ అందగాడుగా అనిపించలేదు. ఐతే, ‘మిస్టర్‌ మజ్ను’లో అఖిల్ లో మహేష్ బాబు కనిపించాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

అక్కినేని జయంతి కానుకగా ఈ సినిమా టీజర్ ని బుధవారం విడుదల చేశారు. ఇందులో ‘ఎక్స్ క్యూజ్ మీ మిస్…. ‘ అంటూ అఖిల్ చెప్పే డైలాగ్ అచ్చం మహేష్ చెప్పినట్టుగానే ఉంది. బహుశా.. అఖిల్ కూడా మహేష్ లాగా సూపర్ స్టార్ అవుతాడేమో చూడాలి. మహేష్ మాదిరిగా అఖిల్ కు అందం ఉంది. ఇక, కావాల్సింది నటనతో మెప్పించడమే.