తోడల్లుళ్లు సంక్రాంతికి వస్తారట

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజుల మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ట్యాగ్ లైన్. అనిల్ రాఘవపూడి దర్శకుడు. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించనున్నారు. సినిమాలో వెంకీ, వరుణ్ లు తోడల్లుళ్లుగా కనిపించబోతున్నారు. తోడల్లుళ్లు సంక్రాంతికి తెరపై హంగామా చేయబోతున్నారు.

ఇటీవలే యూరప్‌లోని ప్రాగ్‌లో రెండు పాటలతో పాటు, కీలకమైన ఛేజింగ్‌ సన్నివేశాల్ని పూర్తి చేసుకొని తిరిగొచ్చింది చిత్రబృందం. వచ్చే నెలలో 25 రోజులపాటు జరిగే షెడ్యూల్‌తో ఎనభై శాతం చిత్రీకరణ పూర్తవుతుందని చిత్రవర్గాలు తెలిపాయి. సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం.