వెంకీ కూతురు పెళ్లి ఫిక్స్
విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లి ఫిక్సయినట్టు సమాచారమ్. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో అశ్రిత వివాహం జరగనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో సురేష్ బాబు మాట్లాడరట. ప్రస్తుతం వెంకీ ‘ఎఫ్ 2’ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగిరాగానే అశ్రిత నిశ్చితార్థ వేడుక ఉండనుందని చెప్పుకొంటున్నారు. ఇక, వచ్చే యేడాది మార్చిలో వివాహ వేడుక నిర్వహించాలని ప్లాన్ చేసుకొన్నారని సమాచారమ్.
వెంకీ పక్కా ఫ్యామిలీ పర్సన్. ఆయన కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. ఆయన పిల్లల్ని సినిమా రంగానికి దూరంగా పెంచారు. అశ్రిత ఫారిన్ లో బేకరీ రంగంలో శిక్షణ తీసుకుంది. ‘ఇన్ఫినిటీ ప్లేటర్’ పేరుతో సిటీలో పలు స్టాల్స్ ను ఆమె నిర్వహిస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె బేకరి బిజినెస్ కంటిన్యూ చేయనుంది. అశ్రిత పెళ్లి నేపథ్యంలో దగ్గుపాటి ఫ్యామిలీలో సంబురాలు మొదలుకానున్నాయి.