ఎన్నికల బరిలో ఎన్టీఆర్ ?

వచ్చే ఎన్నికల్లో నందమూరి కళ్యాణ్ రామ్ బరిలోకి దిగనున్నాడు. అది కూడా తెలంగాణలో. గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం నిన్నా మొన్నటి వరకు సాగింది. హరికృష్ణ మరణం తర్వాత నారా-నందమూరి ఫ్యామిలీ మధ్య తగ్గిన అంతరం నేపథ్యంలో.. అది నిజమేనేమోనని తెలుగు ప్రజలు నమ్మారు. ఐతే, ఇప్పుడు జూ. ఎన్టీఆర్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్టు సమాచారమ్ ఐతే, అది తెరమీద అని తెలిసింది.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికలో ‘అరవింద సమేత’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్, లీకైన యాక్షన్ ఏపీసోడ్ వీడియో సినిమాపై అంచనాలని ఓ రేంజ్ లో పెంచేశాయ్. ఇందులో ఎన్నికల ఏపీసోడ్ కూడా ఉందట. స్థానిక సంస్థల ఎన్నికల ఏపీసోడ్ లో ఎన్టీఆర్ బరిలోకి దిగుతాడని చెబుతున్నారు. అది సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్.

ఎన్నికల బరిలో ఎన్ టీఆర్ అన్న లైన్ ఆకట్టుకుంటోంది. రియల్ లోనూ ఎన్ టీఆర్ ఎన్నికల బరిలోకి దిగితే సంచలనమే. ప్రస్తుతం ఈ సినిమా స్విస్‌–ఇటలీ బోర్డర్‌ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ఓ పాటని చిత్రీకరించారు. ఒకట్రెండు రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాథాకృష్ణ నిర్మాత.