భారత్‌-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్ ‘టై’

ఆసియాకప్‌లో భారత్ జోరు చూపిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చిరకాల ప్రత్యర్థి పాక్ ని రెండుసార్లు మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో సూపర్ – 4లో పసికూన అఫ్గానిస్థాన్‌ ని అవలోకగా ఓడిస్తుందని అందరు భావించారు. ఐతే, అందుకు భిన్నంగా ఈ మ్యాచ్ జరిగింది. ఊరించి.. ఉత్కంఠగా సాగి “టై”గా ముగిసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. వికెట్‌కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌ (124; 116 బంతుల్లో 11×4, 7×6) శతకం సాధించాడు. ఛేదనలో రాహుల్ (60; 66 బంతుల్లో 5×4, 1×6), అంబటి రాయుడు (57; 49 బంతుల్లో 4×4, 4×6) మెరిన 253 పరుగుల భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది.

టీమిండియా గెలవాలంటే 12 బంతుల్లో 13 పరుగులు చేయాలి.. ఇద్దరు రనౌట్‌ అయిపోయారు. 6 బంతుల్లో 7 పరుగులు చేయాలి చేతిలో ఉంది ఒకే వికెట్‌. రషీద్‌ఖాన్‌ చేతిలో బంతి! ఈ స్థితిలో ఆల్‌రౌండర్‌ జడేజా రెండో బంతికి ఫోర్‌ కొట్టి ఆశలు రేపాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్‌ రావడంతో స్కోర్లు సమమయ్యాయి. ఇంకా రెండు బంతులు ఉండడం.. జడేజా స్ట్రైకింగ్‌లో ఉండడంతో భారత్‌దే విజయంగా కనిపించింది. కానీ ఐదో బంతిని గాల్లోకి లేపిన జడేజా ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.