రివ్యూ : దేవదాస్

చిత్రం : దేవదాస్ (2018)

నటీనటులు : నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య

నిర్మాత : అశ్వనీదత్‌

రిలీజ్ డేటు : 27 సెప్టెంబర్, 2018.

రేటింగ్ : 3.5/5

నాగ్, నానిలు కలిశారు. ఓ మల్టీస్టారర్ చిత్రం కోసం జతకట్టబోతున్నారు. ఈ న్యూస్ తొలిసారి తెలిసినప్పుడు ప్రేక్షకుడు థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్. ఇందులో నాగ్ డాన్ గా, నాని డాక్టర్ గా కనిపించబోతున్నారు అని తెలిసినప్పుడు ఇంకా సంతోషించాడు. ఈ సినిమా టైటిల్ ‘దేవదాస్’ తెలియడంతో ఫిదా అయిపోయాడు. ఫస్ట్ లుక్ లో మందు బాటిల్ తో నాగ్, నానిలు. టీజర్ లో ఫస్ట్ పెగ్.. ట్రైలర్ లో హంగామా.. చూసి మురిసిపోయారు.

‘దేవదాస్’లపై బోలేడు ఆశలు పెట్టుకొన్నారు. ఇలాంటి భారీ అంచనాల మధ్య ‘దేవదాస్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ.. ఆ అంచనాలని ‘దేవదాస్’లు అందుకొన్నారా.. ? ఇంతకీ డాన్ (దాస్), డాక్టర్ (దాసు)ల కథేంటీ.. ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.. ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్‌. పోలీస్‌ అటాక్‌లో గాయపడిన దేవకు డాక్టర్‌ దాస్‌ (నాని) వైద్యం చేస్తాడు. తాను క్రిమినల్‌ అని తెలిసినా.. పోలీస్‌లకు పట్టివ్వని దాస్‌ మంచితనం దాసుకు బాగా నచ్చుతుంది. ఆయనతో స్నేహం చేస్తాడు. ముందుగా దాస్ కొంచెం ఇబ్బంది పడినా.. ఆ తర్వాత దేవ్ కు స్నేహితుడు అయిపోతాడు. మనుషులను చంపటం తప్ప ప్రేమించటం తెలియని దేవ, మనుషులను అమాయకంగా నమ్మటం, ప్రేమించటం మాత్రమే తెలిసిన దాస్‌ల మధ్య స్నేహం ఎలా కుదిరింది.. ? ఈ ప్రయాణం ఎలా జరిగింది.. ? ఇంతకీ దేవ ఎవరు.. ?? ఆయన ఎందుకు డాన్ గా మారాడు ??? అన్నది వినోదాత్మకంగా సాగే కథ.

ఎలా ఉందంటే ?

డాన్, డాక్టర్ మధ్య సాగే కథ ఇది. ఈ కథ కోసం నాగ్, నానిలని ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ అయ్యాడు శ్రీరామ్ ఆదిత్య. దానికి ‘దేవదాస్’ టైటిల్ పెట్టి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోటున్నట్టు హిట్ ఇచ్చారు. సినిమాని ఆ రేంజ్ లోనే డీల్ చేశారు. ఫస్టాఫ్ లో డాక్టర్ దాసు (నాని) పాత్రని ఫన్నీగా, డాన్ దాస్ (నాగ్) పాత్రని స్టయిలీష్ గా ఎంట్రీ ఇప్పించేశాడు. దేవ్, దాసుల కలయిక.. ఓ ట్విస్టుతో ఫస్టాఫ్ సరదా సరదాగా సాగింది.

ఇక, సెకాంఢాఫ్ లో అసలు దేవ్ ఎవరు ? అనే పాయింట్ చెపే ఏపీసోడ్ ని బాగా డీల్ చేశాడు దర్శకుడు. డాన్ జీవితంలో ఎమోషనల్ పార్ట్ ఆకట్టుకుంటుంది. నాగ్, నానిల కలయికలో వచ్చే ప్రతీసీన్ బాగుంది. అక్కడక్కడా సినిమా పడిపోతుంది అన్న సమయంలో ఏదో మేజిక్ చేసి పైకి లేపాడు. దాని కోసం నాగ్ పాత్రని బాగా వాడుకొన్నాడు. ఫైనల్ గా దేవదాస్ లని బాగా డీల్ చేసి.. ప్రేక్షకులని వినోదం పంచాడు.

ఎవరెలా చేశారంటే.. ?

నాగ్, నాని.. ఇద్దరి నటనకు వంక పెట్టలేం. డాన్ పాత్రలు నాగ్ కి కొత్తమే కాదు. ‘డాన్’ టైటిల్ తో ఆయన సినిమా కూడా చేశారు. ఈ డాన్ డాక్టర్ దాసుతో కలిసి చేసిన హంగామా వినోదాన్ని పంచింది. ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన అద్భుతం. ఇక, నాని టైమింగ్ అదిరింది. సినిమా మొత్తం వీరిద్దరి మధ్యే నడుస్తోంది. ఈ సినిమాకు అదే ప్లస్ కూడా. వీరి కలయికలో వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా ఉంది.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలకు పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు. ఐతే, ఉన్నంతలో ఆకట్టుకొన్నారు. నాగ్, నాని, ఆకాంక్ష, రష్మిక.. నలుగురు కనిపించే పాటలు తెరపై అందంగా అనిపించాయి. డాక్టర్ దాసుకి అసిస్టెంటు గా చేసిన అవసరాల శ్రీనివాస్, తోటి డాక్టర్ గా చేసిన కూచిపూడి (వెన్నెల కిషోర్) నటన బాగుంది. మితిగా పాత్రల్లో నరేష్‌, సత్య, మురళీశర్మ తదితరులు ఆకట్టుకొన్నారు.

సాంకేతికంగా :

మణిశర్మ అందించిన పాటలు, అంతకుమించి నేపథ్య సంగీతం బాగుంది. శ్యామ్‌ దత్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సెకాంఢాఫ్ లో కొన్ని చోట్ల సినిమా స్లోగా సాగినట్టు అనిపించింది. ఇక, వైజంతీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : దేవదాస్.. నవ్వులే నవ్వులు !

రేటింగ్ : 3.5/5