అందుకే రేవంత్ రెడ్డిపై దాడులు !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని టార్గెట్ చేసుకొని.. ఆయన నివాసం, బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రేవంత్ అక్రమంగా సంపాదించిన ఆస్తిని ఐటీ అధికారులు గుర్తించాలని చెబుతున్నారు.

మరోవైపు, ఈ దాడులు రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రేవంట్ రెడ్డిపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి ? అన్నది పెద్దగా ప్రశ్నగా మారాయి. దీనికి తెరాస ఎంపీ బాల్క సుమన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. 40యేళ్లుగా రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డిలపై జరగని ఐటీ దాడులు ఒక్క రేవంత్ పైనే ఎందుకు జరుగుతున్నాయి. అంటే.. రేవంత్ రెడ్డి భారీగా అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డాడని ఆరోపించారు.

బాల్క సుమన్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి స్థాయిలో ఎప్పుడు కేసీఆర్ ని టార్గెట్ చేయలేదు. చాలా ఇష్టమైన టీడీపీని వదిలి టీఆర్ఎస్ దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ లోకి రాలేదు. వచ్చి ఊరికే ఊరుకోకుండా.. అధిష్టానం దగ్గరికి వెళ్లి ఎన్నికల ప్రచార బాధ్యతలని భుజాల వేసుకోలేదు. ఊరు ఊరు తిరిగి కేసీఆర్ ని బదనాం చేస్తమని ప్రతిజ్ఝపూనలేదు. బహుశా.. అందుకే జానా, జైపాల్ రెడ్డిలని వదిలి రేవంత్ రెడ్డిపై దాడులు జరూతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నయ్.