రేవంత్ రెడ్డి.. ఇంకా లెక్క తేలలే !

తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అవినీతి లెక్క ఇంకా తేలలే. ఆయనతో పాటు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ ఏకకాలంలో దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 16 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

సోదాల్లో దాదాపు రూ.కోటిన్నర నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన కొన్ని ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా ఇది అంటూ.. సంచలన అంశాలతో కూడిన ఓ లేఖ అన్ని మీడియా సంస్థలకు అందింది. ఇందులో రేవంత్‌కు హాంకాంగ్‌, కౌలంపూర్‌ల్లోనూ బ్యాంకు ఖాతాలున్నాయని పేర్కొన్నారు.

ఆయా వీటిలో కోట్ల రూపాయలు జమయ్యాయి. ఒకే రోజు రూ.20 కోట్లకు పైగా విలువైన విదేశీ కరెన్సీ రేవంత్‌ ఖాతాల్లో జమయిందని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందే ఈ మొత్తం వచ్చినా.. ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదు. ఎందుకంటే ఈ సొమ్ము మనీల్యాండరింగ్‌, హవాలా తదితర మార్గాల్లో వచ్చింది. రేవంత్‌రెడ్డి సోదరులు, ఇతర కుటుంబసభ్యుల పేర్లతో దేశ విదేశాల్లో భారీగా ఆస్తులు సంపాదించారుని ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజమెంత ? అనేది ఐటీ శాఖ సోదలు పూర్తయితే క్లారిటీ రానుంది.