షాక్ : పవన్ హత్యకు కుట్ర
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో టేపు ఒకటి బయటికొచ్చింది. ఇందులో పవన్ హత్య గురించి ముగ్గురు మాట్లాడుకొంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ ని చంపేస్తే.. ఏమవుతుంది ? అందుకు కారకులు ప్రతిపక్షమని, అధికార పక్షమని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటారు. ఆపై జనమూ మరిచిపోతారని ముచ్చటించుకుంటున్నారు. ఈ ఆడియో టేపు పవన్ వద్దకు వచ్చింది.
ఈ విషయాన్ని పవన్ గురువారం ఏలూరు సభలో బయటపెట్టారు. ‘వాళ్లెవరో కూడా నాకు తెలుసు. ఇలాంటివన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానా ? అలాంటి వాటికి భయపడను’నని తెలిపారు పవన్. 3తరాలు గుర్తుండిపోయేలా విధానాలు తేవాలనేదే నా ఆశయం. ఎన్నికల్లో గెలవటానికి కావాల్సిన 18శాతం ఓటుబ్యాంకు మాకుంది అంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు.