అరవింద.. వేడుక డేటు ఫిక్స్ !

‘అరవింద సమేత’ విడుదల తేది ఫిక్సయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ హారిక & హాసిని అధికారికంగా ప్రకటించింది. ఐతే, అంతకంటే ముందు ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా, ఈ వేడుక డేటుని కూడా ఫిక్స్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు అక్టోబర్ 2నే ఈ వేడుకని నిర్వహించబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఆరోజు మంగళవారం అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కీడు శంకించడాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, అదే రోజున సినిమా సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకోనుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రమిది. ఆయన సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. అదే యాసలో తారక్ డైలాగులు ఉండనున్నాయి. అవి అదిరిపోయే ఉండబోతున్నాయని టీజర్ తో అర్థమైంది. ఫ్యాక్షన్, యాక్షన్ ఎన్టీఆర్ కు కొట్టిన పిండి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని అద్భుతంగా చూపించడం త్రివిక్రమ్ ప్రత్యేకత. ఈ రెండూ అరవింద సమేతలో ఉండబోతున్నాయట. ఈ సినిమాకు సంగీతం. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాథాకృష్ణ నిర్మాత.