కేసీఆర్ ముందస్తు వార్నింగ్

టికెట్ల కేటాయింపుల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసమ్మతి లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇప్పటికే కేటాయించిన 105 స్థానాల్లో ఒకరిద్దరు తప్ప పెద్దగా అసమ్మత్తి తలెత్తలేదు. ఇందుకుగానూ.. ముందుగానే సిట్టింగ్స్ కే పెద్దపీఠ వేస్తున్నట్టు కేసీఆర్ సాంకేతాలివ్వడం కలిసొచ్చింది. ఇప్పుడు మిగిలిన 14 స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేసే విషయంలో ఎలాంటి అసమ్మతి లేకుండా చూసుకొంటున్నారు కేసీఆర్.

ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గ నేతలతో నేరుగా మాట్లాడుతున్నారు. మీరో, మరొకరో.. అభ్యర్థులెవరైనా కావచ్చు. ఎన్నికల్లో తెరాస విజయానికి కృషి చేయాలి సూచిస్తున్నారు. శుక్రవారం కేసీఆర్ వరంగల్‌ తూర్పు నియోజకవర్గం, హుజూర్‌నగర్‌, కోదాడ, జహీరాబాద్‌, చొప్పదండి, వికారాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, గోషామహల్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేటల నాయకుల మాట్లాడారు. టికెట్ దక్కని నేతలు అసంతృప్తికి గురికావొద్దు. టికెట్ లభించిన అభ్యర్థి విజయానికి కృష్హి చేయాలని ముందస్తుగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక, అక్టోబర్ 3 నుంచి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.