‘నోటా’ సెన్సార్ రివ్యూ
యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘నోటా’. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ తరువాత నటించిన ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. అయన సరసన మెహ్రీన్ జతకట్టనుంది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ని సొంతం చేసుకొంది. ఇందులో సమకాలీన రాజకీయాలని ప్రస్థావించారు. తమిళ రాజకీయాలు. అందులోనూ జయలలిత మరణం సంబంధించిన ఏపీసోడ్ ని టచ్ చేయనున్నారు. తెలుగు రాజకీయాలని పరోక్షంగా ప్రస్తావించబోతున్నారు. సినిమాలో కేసీఆర్, కేటీఆర్ ని పోలిన పాత్రలు కనిపిస్తాయనే ప్రచారం జరిగింది. దీంతో.. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుందని అందరు భావించారు. ఐతే, ‘నోటా’ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ని అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.
ఇక, ‘నోటా’ అదిరిపోయినట్టు.. సినిమా చూసిన సెన్సార్ సభ్యుల చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్ నటన సినిమాకే హైలైట్ గా నిలువనుందట. ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టేనని సెన్సార్ టాక్. ఈ సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్వయంగా విజయ్ పాల్గొనబోతున్నాడు. ‘ది నోటా పబ్లిక్ మీట్’ పేరుతో ఈ నెల 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్ లో విజయ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.