రేవంత్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖాధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం నుంచి శనివారం వేకువజామున 2.30 గంటల వరకు ఈ సోదాలు కొనసాగాయి. దాదాపు 44 గంటల పాటు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో రూ.20 కోట్లు లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం రేవంత్‌ బామ్మర్ది జయప్రకాశ్‌ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన మొత్తంగా తేలింది. రేవంత్‌ ఇంటినుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అక్టోబర్‌ మూడో తేదీన ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. మరోవైపు, రేవంత్‌ రెడ్డి నివాసంలో దాడులు రాజకీయ కక్ష్య సాధింపులో భాగమేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.