రవితేజ రొమాన్స్ లీకు.. ఏకంగా ముగ్గురితో !

మాస్ మహారాజా రవితేజ రొమాన్స్ లీకైంది. ఆయన ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అమర్ అక్భర్ ఆంథోనీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. హీరోగా టర్న్ తీసుకొన్న సునీల్ కమెడియన్ రీ-ఎంట్రీ ఇచ్చి నటిస్తున్నాడు. ఆయన మళ్లీ ఫుల్లుగా నవ్వించబోతున్నాడట.

ఈ సినిమా తర్వాత రవితేజ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫేం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. యాక్షన్‌ ప్రధానమైన ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘డిస్కో రాజా’ టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఇందులో రవితేజ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. ఓ కథానాయికగా ఇప్పటికే నభా నటేష్‌ ఎంపికయ్యారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో తన అందంతో ప్రేక్షకుల మనసులని దోచేసింది నభా. మిగితా ఇద్దరు హీరోయిన్స్ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.