టీ-కాంగ్రెస్ తొలి జాబితా రెడీ !

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల నోటీఫికేషన్ రానుంది. నవంబర్ నెలాఖరులో ఎన్నికలు, డిసెంబర్ లో ఫలితాలు వెలువడనున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులని ప్రకటించేసింది. వీరిలో ఇద్దరికి తప్ప.. మిగితా అన్నీ స్థానాల్లో సిట్టింగులకే అవకాశం ఇచ్చింది. ఇక, మిగిలిన 14మంది అభ్యర్థులని ఖరారు చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. ఆయా నియోకవర్గ నేతలతో కేసీఆర్ నేరుగా మాట్లాడుతున్నారు. రెండు మూడ్రోజుల్లోనే ఆ స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికలో వేగాన్ని పెంచింది. ఇప్పటికే తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసింది. 40మందితో కూడిన తొలి జాబితాని సిద్ధం చేసింది. ముందుగా ఎలాంటి వివాదాలు లేకుండా అభ్యర్థులను ప్రకటించగలిగిన తొలి జాబితాని సిద్ధం చేసింది. తొలి జాబితాను అధిష్ఠానానికి పంపి స్క్రీనింగ్‌ కమిటీ ఆమోద ముద్ర వేయించుకోవడం, ప్రకటన చేయడం వెంటవెంటనే జరుగుతాయని తెలుస్తోంది.

తొలి జాబితాలో అవకాశం దక్కించుకొన్న అభ్యర్థులు వీరే ళ్

మర్రి శశిధర్‌రెడ్డి (సనత్‌నగర్‌), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), శ్రీధర్‌బాబు (మంథని) ఎ.లక్ష్మణకుమార్‌ (ధర్మపురి), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు), మల్లు భట్టివిక్రమార్క (మధిర), రేగా కాంతారావు (పినపాక), రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), జి.చిన్నారెడ్డి (వనపర్తి), డి.కె.అరుణ (గద్వాల), ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ (అలంపూర్‌), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), టి.రామ్మోహన్‌రెడ్డి (పరిగి), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), ప్రతాపరెడ్డి (షాద్‌నగర్‌), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), దామోదర్‌ రాజనర్సింహ (ఆంథోల్‌), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), గీతారెడ్డి (జహీరాబాద్‌), జగ్గారెడ్డి (సంగారెడ్డి), ప్రతాపరెడ్డి (గజ్వేల్‌), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), ఆర్‌.దామోదర్‌రెడ్డి (సూర్యాపేట), జానారెడ్డి (నాగార్జునసాగర్‌), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌), పద్మావతి (కోదాడ), బిక్షమయ్యగౌడ్‌ (ఆలేరు), సుదర్శన్‌రెడ్డి (బోధన్‌), షబ్బీర్‌అలీ (కామారెడ్డి), అనిల్‌ (బాల్కొండ), పొన్నాల లక్ష్మయ్య (జనగాం), దొంతిమాధవరెడ్డి (నర్సంపేట), గండ్ర వెంకట్రమణారెడ్డి (భూపాలపల్లి).