బిగ్ బాస్ 2 విజేత కౌశల్

బిగ్ బాస్ 2 ఎలాంటి సస్పెన్స్ లేకుండానే ముగిసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు కౌశల్ బిగ్ బాస్ 2 విజేతగా నిలిచారు. ఈ విషయం ముందే లీకైంది. అంతేకాదు.. గ్రాండ్ ఫినాలేకు చేరిన ఐదురుగు సభ్యులు సామ్రాట్, కౌశల్, తనీష్, గీతా మాధురి, దీప్తిలలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్కలు కూడా బయటికొచ్చాయి. టైటిల్ అందుకొన్న కౌశల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక, బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలేని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. చివరిసారిగా నాని ఇంటి సభ్యులతో ఒక్కొక్కరితో మాట్లాడారు. ఆ తర్వాత ఎలిమినేషన్ కి వెళ్లిపోయారు. మొదటగా ఇంటి నుంచి సామ్రాట్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత దీప్తి, తనీష్, ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ గా కౌశల్, గీతా మాధురిలలో విన్నర్ గా కౌశల్ ని ప్రకటించేశారు. ఫైనల్ ఏపీసోడ్ లో తెలుగు టైటాన్స్ జెర్సీ విడుదల, బిగ్ బాస్ 2 సభ్యులు నందిని, శ్యామల, దీప్తి సునైనా ల డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది.