రామ్’తో రకుల్ పెళ్లి ?
టాలీవుడ్ లో మరో ప్రేమ వ్యవహారం బయటపడింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యంగ్ హీరో రామ్ తో ప్రేమలో పడింది. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక చాలా సీక్రెట్ గా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కెరీర్ మొదట్లో రకుల్ వరుసగా యంగ్ హీరోలతో జతకట్టింది. ఈ క్రమంలో రామ్ తో కలిసి ‘పండగ చేస్కో’ సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం కానేచ్చారని చెబుతున్నారు.
అతి తక్కువ కాలంలోనే రకుల్ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది. ఆమె పేరిట మెగా రికార్డు కూడా ఉంది. ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తప్ప మెగా హీరోలందరితోనూ జతకట్టింది. హీరోయిన్ గానే కాదు బిజినెస్ లోనూ రకుల్ నెంబర్.1. హైదరాబాద్, ఇతర నగరాల్లో జిమ్ లని నడుపుతోంది. ఇదీగాక, హైదరాబాద్ తో రకుల్ ప్రత్యేక బంధాన్ని ఏర్పర్చుకొంది. హైదరాబాద్ కు కోడలు అవ్వాలనుందనే ఆకాంక్షని పలుమార్లు వ్యక్తం చేసింది కూడా.
ఈ నేపథ్యంలోనే ఆమె రామ్ ని ప్రేమించి ఉంటుంది. అది కాస్త పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు సైలైంట్’గా పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఐతే, ఈ ప్రచారాన్ని రామ్ ఖండించారు. ఇదంతా ఉత్తిత్తి ప్రచారం మాత్రమే. నిజానికి రకుల్ నాకు చాలా క్లోజ్ కాదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఇప్పటివరకు నాకు ఏ అమ్మాయి కనెక్ట్ కాలేదు. ఒకవేళ అయితే ఆ విషయాన్ని అర్థరాత్రైనా మీడియాకు ఫోన్ చేసి చెబుతా. దయచేసి.. ఇలాంటి గాసిప్ లని ప్రచారం చేయొద్దని విజ్ఝప్తి చేశారు రామ్. సో.. రకుల్-రామ్ ప్రేమ గాసిప్పే