గ్రేట్ : తెలంగాణ ఎన్నికల బరిలో బాలయ్య

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగడం దాదాపు ఖాయమైంది. ఈ నెల రెండో వారంలోనే ఎన్నికల నోటీఫికేషన్ రావొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నెల 3 నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వరుసగా భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ ఎన్నికల ప్రచారం టీ-టీడీపీ కాస్త వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సినీ గ్లామర్ ని వాడుకుంటోంది. ఇందులో భాగంగా బాలకృష్ణని రంగంలోకి దింపింది. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య కమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే బాలయ్య, పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీకి చెందినవారు నిలబడబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇందుకోసం కళ్యాణ్ రామ్ పేరు బలంగా వినిపించింది. ఆయన గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గంలో టీ-టీడీపీ తరుపు నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన బాబాయ్ బాలయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చూస్తుంటే.. నందమూరి ఫ్యామిలీ తెలంగాణపై ఫోకస్ చేసినట్టుంది.