కంగ్రాట్స్ కౌశల్‌

బిగ్ బాస్ తెలుగు ఖాతాలో మరో విక్టరీ చేరింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ – 1 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తారక్ తనదైన మార్క్ తో బిగ్ బాస్ తెలుగుని ఓ స్థాయిలో నిలబెట్టారు. ఇక, సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవరించిన నాచురల్ స్టార్ నాని ఆ స్థాయి తగ్గకుండా జాగ్రత్తగా డీల్ చేశారు. మొత్తానికి.. సీజన్ -2 తో బిగ్ బాస్ తెలుగు ఖాతాలో మరో విక్టరీని తెచ్చిపెట్టాడు.

అంతేకాదు.. ఫైనల్ ఏపీసోడ్ కి విక్టరీ వెంకటేష్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చి షోని కలర్ ఫుల్ గా ముగించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు సీజన్ – 1 విజేతగా కౌశల్‌ నిలిచారు. గీతా మాధురి రన్ రప్ గా నిలిచారు. మిగితా స్థానాలో తనీష్, దీప్తి, సామ్రాట్ నిలిచారు. ఇక, విజేతగా నిలిచిన కౌశల్‌ కు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి, మారుతి కౌశల్‌ ని విష్ చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలోనూ కౌశల్‌ విజేతగా నిలిచిన న్యూస్ హెడ్ లైన్స్ లో నిలిచింది.

బిగ్ బాస్ – 2 జూన్‌ 10న ప్రారంభమైంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 113 రోజుల పాటు సాగింది. విన్నర్ గా నిలిచిన కౌశల్‌ కు ముక్కుసూటితనం కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇచ్చే టాస్క్‌ల్లో కూడా కౌశల్‌ తనదైన ముద్ర వేశాడు. బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్‌ కు టీఎస్ మిర్చి డాట్ కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.