పవన్ పై కత్తి దూశాడు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి కత్తులు దూశాడు మహేష్ కత్తి. గతంలో మహేష్ కత్తి, పవన్ అభిమానుల మధ్య పెద్ద యుద్దమే జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏపీసోడ్ కాస్త సద్దుమణిగిన తర్వాత మహేష్ నగర బహిష్కరణకు గురయ్యాడు. అప్పటి నుంచి మహేష్ సలైంట్ అయిపోయాడు. ఇటీవల తన శాశ్వత నివాసాన్ని విజయవాడకు మార్చుకొన్నాడు మహేష్. అక్కడ కాస్త రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ మొదలెట్టాడు.
తాజాగా, మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు. అది కూడా శ్రీరెడ్డితో లింకుపెట్టి. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డిని పోలీసులని ఆశ్రయించాలని పవన్ సూచించారు. ఇప్పుడు తన హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్న పవన్ ఎందుకు పోలీసులని ఆశ్రయించడం లేదని ప్రశ్నించారు. దీంతో పాటు తన రాజకీయ జీవితంపై క్లారిటీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా దళితులకు రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఉందన్నారు