తనుశ్రీపై దాడి వీడియో.. వైరల్ !

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ లైంగిక ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తాపై దాడి జరిగింది. కొందరు రౌడీలు ఆమె వెళ్తున్న కారుపై దాడి చేశారు. నానా హంగామా చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే, అది ఇప్పటి వీడియో కాదు. 2008 ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకొన్న సంఘటనకు సంబంధించిన వీడియో.

ఇటీవల నానా పటేకర్ తో పాటు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిపై తనుశ్రీ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏపీసోడ్ ఆమెకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తనుకి సపోర్ట్ చేస్తున్నారు. ఐతే, ఈ ఆరోపణల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ.. ఆనాడు చోటు చేసుకొన్న సంఘటనని పూసగుచ్చినట్టు వివరించింది.

ఆ నాటి గొడవకు సంబంధించి న్యూస్‌ ఎమ్‌వోలో ప్రసారమైన వీడియో.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోని చూస్తే తనుశ్రీ ఆరోపణలు అక్షరాల నిజమని అర్థమవుతోంది. తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్ పై బాలీవుడ్ లో బ్యాన్ విధించే అవకాశాలు లేకపోలేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. తనుశ్రీ-నానాల గొడవ బాలీవుడ్ ని కుదిపేస్తోంది.