ప్రభాస్ ప్రేమకథ.. లుక్ అదిరింది !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్ కూడా షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. తాజాగా, ఈ సినిమాలో ప్రభాస్ లుక్ బయటికొచ్చింది.

ఇట‌లీ స్థానిక అధికారుల‌తో క‌లిసి ప్రభాస్ ఫోటోల‌కి ఫోజులిచ్చాడు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రభాస్ మీసాలు లేకుండా.. క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. దీంతో ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ లుక్ ఇదే అయి ఉంటుందని ఆయన అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ప్రభాస్ న్యూ లుక్ బాగుందంటూ కితాబిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక, ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా 40%పైగా పూర్తయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాహుబలి ని మించేలా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.