బిగ్ బాస్-3 కోసం త్రీ-స్టార్స్

బిగ్ బాస్ రియాల్టీ షో.. హిందీలో సూపర్ హిట్. ఇప్పటికే 11 సీజన్స్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ సూపర్ హిట్ షో తెలుగులోనూ మొదలైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. షోని ఓ రేంజ్ తీసుకెళ్లి నిలబెట్టారు. ఇక, నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2 ఇటీవలే పూర్తయ్యింది. దీంతో అప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పై చర్చ మొదలైంది. సీజన్ 3 కోసం స్టార్ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్, యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి పేర్లు వినిపిస్తునాయి. వీరిలో ఒకరు సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారమ్. సీజన్ 2 కోసం ముందుగా బన్నీనే సంప్రదించారనే వార్తలొచ్చాయ్. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ కోసం బన్నీని అడుగుతున్నారంట. యూత్’లో మంచి క్రేజ్ గల విజయ్ దేవరకొండ అయితే సీజన్3 అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తుందట. ఇక, ఇంటర్నేషనల్ స్టార్ అనిపించుకొన్న రానా దగ్గుపాటి కూడా ఓ మంచి ఆప్షన్ గా భావిస్తున్నారు. మరీ.. త్రీ-స్టార్స్’లో ఎవరు సెట్ అవుతారో.. చూడాలి.