వాహ్.. బాలకృష్ణ జంటగా విజయశాంతి !

బాలకృష్ణ-విజయశాంతిలది సూపర్ హిట్ జోడీ. 1990 దశకంలో హవా చూపించారు. వీరి కలయికలో మువ్వగోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, ముద్దుల మామయ్య.. లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయ్. ఇన్నాళ్లు వీరు మళ్లీ జంటగా రాబోతున్నట్టు సమాచారమ్. ఐతే, సినిమాలో కాదు. పొలిటికల్ క్యాంపైనింగ్ లో. ప్రస్తుతం వీరిద్దరు రాజకీయాల్లో ఉన్నారు.

బాలయ్య టీడీపీలో, విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ప్రచారాన్ని కలిసే ప్లాన్ చేసుకొంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నుంచి విజయశాంతి స్టార్ క్యాంపైనర్ గా రంగంలోకి దిగుతున్నారు. ఆమె వచ్చే 40 రోజుల్లో 90 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలయ్యని దింపాలని టీడీపీ ఆలోచిస్తోంది.

ఈ నేపథ్యంలో బాలయ్య-విజయశాంతి జంటగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనిపై రెండు పార్టీల్లో చర్చ జరుగుతుందట. వీరిద్దరు కలిసి ప్రచారం చేస్తే.. బాగుంటుందని చెబుతున్నారు. ఇన్నాళ్లు తెరపై సూపర్ జోడీ అనిపించుకొన్న బాలయ్య-విజయ్ శాంతి.. పొలిటికల్ ప్రచారంలోనూ సూపర్ జోడీ అనిపించుకుంటారేమో చూడాలి.