త్రివిక్రమ్ – బన్నీ సెట్ చేసిన వెంకీ !

‘నా పేరు సూర్య’ తర్వాత స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మరో సినిమా మొదలెట్టలేదు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ రాసిన కథ బన్నీకి నచ్చలేదు. దీంతో ఆయన మరో కొత్త కథపై కూర్చొన్నాడు. అది పూర్తయ్యేలోపు కాస్త టైం పట్టనుందనే ప్రచారం జరిగింది. బన్నీ కూడా అభిమానులని ఓపిక పట్టండి. ఈ సారి మంచి కథతో వస్తానని చెప్పారు.

మరోవైపు, బన్నీ మళ్లీ త్రివిక్రమ్ వైపు చూస్తున్నాడు. వీరి కలయికలో మరో సినిమా రాబోతుందనే ప్రచారం జరిగింది. ఐతే, ప్రస్తుతం అరవింద సమేతతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ తర్వాత సినిమా వెంకటేష్ తో చేస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు వెంకీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఎఫ్2’ షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకీ.. ఆ తర్వాత చైతూతో కలిసి వెంకీ మామా లో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేయమని త్రివిక్రమ్ కి చెప్పాడట వెంకీ.

ఈ గ్యాప్ లో బన్నీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఇప్పటికే త్రివిక్రమ్ బన్నీకి ఓ కథ చెప్పాడు. అది బన్నీకి కూడా నచ్చింది. స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్నిమార్పులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్-బన్నీ హ్యాట్రిక్ సినిమా రాబోతుందని చెప్పుకొంటున్నారు.