అభిమానితో బాలయ్య ప్రవర్తన.. వైరల్ !

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులతో ప్రవర్తించిన తీరు చాలా సార్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన పలుమార్లు అభిమానులపై చేయి చేసుకొన్న సందర్భాలున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా, మరోసారి బాలయ్య అభిమానితో ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది.

ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్’తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కృష్ణ జిల్లా హంసల దీవిలో జరిగుతోంది. షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో ఓ నిరుపేద బాలయ్య దగ్గరకు వచ్చాడు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు సాయం చేయాలని కాళ్లా వేళ్లా పడ్దారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయింది. వెంటనే బాలయ్య బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఫోన్ చేసి.. ఆ వృద్దుడి వివరాలు తెలియజేశారట. అంతేకాదు.. ఆ వృద్దికి ఉచిత వైద్యం అందించాలని సూచించారట. బాలయ్య మంచి మనసుకు అందరు అభినందిస్తున్నారు.