కాజల్ ని బాగా వాడుకొంటున్నాడు

తేజ సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’తో కాజల్ తెలుగు తెరకు పరిచయమైంది. కళ్యాణ్ రామ్-కాజల్ జంటగా నటించిన ఈ చిత్రం ఓ మోస్తారుగా ఆడింది. ఆ తర్వాత కాజల్ కృష్ణవంశీ చేతిలో పడింది. టాలీవుడ్ ‘చందమామ’ అయ్యింది. ఈ సినిమా తర్వాత కాజల్ కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. ఐతే, హీరోయిన్’గా కాజల్ పనైపోయిందనే టైంలో ఆమెని తిరిగి ఫాంలోకి తీసుకొచ్చిన క్రెడిట్ తేజది. ‘నేనే రాజు నేనే మంత్రి’తో కాజల్ కి అదిరిపోయే హిట్ అందించారు.

ఈ సినిమా తర్వాత కాజల్ కు వరుసగా యంగ్ హీరోల సరసన జతకట్టే అవకాశాన్ని కొట్టేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. అక్కడ షూటింగ్ స్పాట్ లో కాజల్ పెద్ద సాహసమే చేసింది. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతోపాటు ఓ జలపాతం దగ్గర కాజల్ పై కెమెరాకు క్లిక్స్ పడుతున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చూస్తుంటే బెల్లకొండ సినిమా ప్రమోషన్స్ మొత్తం కాజల్ పై చేసేందుకు తేజ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాజల్ కు ఒకసారి కాదు.. రెండు సార్లు లైఫ్ నిచ్చిన తేజ ఆమెని బాగానే వాడుకొంటున్నాడు. మరీ.. కాజల్ ప్రమోషన్స్ బెల్లకొండకు హిట్ తెచ్చి పెడతాయో చూడాలి.

 

View this post on Instagram

 

WHAT AN EXPERIENCE

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on