‘నోటా’ పబ్లిక్ టాక్
యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ నటించిన ద్విబాషా చిత్రం ‘నోటా’. మెహ్రీన్ హీరోయి. ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. భారీ అంచనాల మధ్య ‘నోటా’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఉదయం పూట ఆటపడిపోయింది. మరీ.. నోటా పబ్లిక్ టాక్ ఏంటో చూద్దాం.. పదండీ.. !
‘యెత్తర యెత్తర.. ‘ అనే సాంగ్ తో విజయ్ దేవరకొండ పరిచయం చేయబడ్డాడు. ఆ తర్వాత సినిమా పొలిటికల్ మూడ్ లోకి మారింది. సీనియర్ జర్నలిస్ట్ గా సత్యరాజ్ కనిపించారు. విజయ్ తండ్రిగా నాజర్ కనిపించారు. తండ్రి కోరిక మేరకు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తాడు. ఐతే, పెద్దగా బాధ్యతగా వ్యవహరించడు. ఓ ట్విస్టు తర్వాత విజయ్ సీరియస్ గా బాద్యతాయుతమైన పొలిటీషియన్ గా మారిపోతాడు.
చాలా సరదాగా మొదలైన కథని సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లడానికి దర్శకుడు పెద్దగా టైమ్ తీసుకోలేదు. పొలిటికల్ సటైర్స్, ఉగ్రవాదుల ఏపీసోడ్, నాజర్ గాయపడటం.. ఏపీసోడ్ తో ఫస్టాఫ్ గ్రిప్పింగ్ సాగింది. ఇక, సెకాంఢాఫ్ అధికార-విపక్షాల పొలిటికల్ వార్. హీరో ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ లో పొలిటికల్ మైండ్ గేమ్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. మొత్తంగా.. యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండగా యంగ్ సీఎంగా అదరగొట్టేశాడని చెప్పుకొంటున్నారు.