తెలంగాణలో మోగిన ఎన్నికల గంట

తెలంగాణలో ఎన్నికల నగారా మ్రోగింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో డిసెంబర్ 7న నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఎన్నికలు ముఖ్య తేదీలు :

* తెలంగాణలో నామినేషన్లకు తుది గడువు: నవంబర్‌ 19

* నామినేషన్ల పరిశీలన: నవంబర్‌ 20

* నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్‌ 22

* పోలింగ్‌ తేదీ: డిసెంబర్‌ 7

* ఓట్ల లెక్కింపు: డిసెంబర్‌ 11