పెళ్లిరోజు శుభాకాంక్షలు చై-సామ్ !

నాగ చైతన్య-సమంతల వివాహ బంధం యేడాది పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఈ దంపతులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ‘ఏ మాయ చేశావె’ సినిమా కోసం సామ్-చై తొలిసారి జతకట్టారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. పెద్దలని ఒప్పించి గత యేడాది అక్టోబర్ 6న పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. నేటితో వీరి వివాహ బంధానికి యేడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి.

ఇక, పెళ్లి తర్వాత చై-సామ్ లకి బాగా కలిసొచ్చింది. ఈ యేడాది సమంత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, శైలజారెడ్డి అల్లుడు సినిమాలతో చైతూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇక, పెళ్లి తర్వాత చై-సామ్ తొలిసారి జతకట్టబోతున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ‘మజిలీ’ టైటిల్ అనుకొంటున్నారు.