చంద్రబాబు బాధని తెలిపిన జేసీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధని గురించి తెలిపారు ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్ది. ముక్కుసూటిగా మాట్లాడే జేసీ.. ఏపీలో ఐటీ శాఖ అధికారుల దాడులపై తనదైన శైలిలో స్పందించారు. మోడీ లాంటి వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవద్దని తాను చంద్రబాబుకు ముందుగానే సూచించా. ఇప్పుడు తన సహచరుల మీద ఐటీ దాడులు జరగడంపై చంద్రబాబు బాధపడుతున్నారని అన్నారు జేసీ. చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలపై జేసీ సటైర్స్ వేశారు. కేసీఆర్ మూడో కన్ను తెరిస్తే.. భస్మాసురుడిలా ఆయనే కాలిపోతారన్నారు.