నానాపై తను ఫిర్యాదు
బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా – నానా పటేకర్ ల వివాదం నోటీసుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక ఆరోపణలు చేసిన తనుశ్రీకి నానా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులు తనకి అందాయని తనుశ్రీ ధృవీకరించింది. ఇప్పుడు నానాకి తను రివర్స్ పంచ్ ఇచ్చింది. ఆయనపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై నానా స్పందించారు. ‘ఆమె ఆరోపణ అబద్ధమని పదేళ్ల క్రితమే చెప్పా’నన్నారు. మరీ.. ఈ వివాదం ఏ తీరం చేరుతుందో.. ? ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో ?? చూడాలి. మరోవైపు, ఈ వివాదంలో తనుశ్రీ దత్తాకు రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ సైతం తనుని సపోర్టు చేస్తున్నారు. ఇదీగాక, గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులని సోషల్ మీడియా వేదిక పంచుకొంటున్నారు. హాలీవుడ్ లో ‘మీటూ’ ఉద్యమం మాదిరిగా బాలీవుడ్ లో ఓ ఉద్యమం మొదలైనట్టు కనిపిస్తోంది.