తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద ?
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద సడెన్ గా సీఎం రేసులోకి వచ్చేశారు. ఆయన్ని తెలంగాణ భాజాపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారమ్. ఇందులో సోమవారం స్వామీజీని అత్యవసరంగా హస్తినకు రావాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా నుంచి పరిపూర్ణానందకు పిలుపు వచ్చింది. సీఎం అభ్యర్థిగా కాకుంటే ఎంపీగానైనా ఆయనను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పరిపూర్ణానంద గతంలోనే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని ప్రకటించిన ఆయన బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఏది ముందు ఆహ్వానిస్తే అందులో చేరి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పరిపూర్ణానందని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశగా మారింది. దీని వెనక భాజాపా వ్యూహం ఏమై ఉంటుందని విశ్లేషించే పనిలో రాజకీయ పండితులు ఉన్నారు.