విశాల్’కు హ్యాండించిన వరలక్ష్మీ
కోలీవుడ్ ప్రేమజంట విశాల్ – వరలక్ష్మీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2019లో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ప్రచారంపై వరలక్ష్మీ స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్‌పైనే ఉందన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేశారు.
“నేను పెళ్లి చేసుకోబోతున్నానని చిత్ర పరిశ్రమలో వదంతులు వస్తున్నాయి. నాకు నిశ్చితార్థం జరగలేదు.. నేను పెళ్లి చేసుకోవడం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి నన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ కేవలం పనిచేయడానికి, నటించడానికి ఉన్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది’ అంటూ వరలక్ష్మీ ట్విట్ చేశారు.
ప్రస్తుతం వరలక్ష్మి చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. ప్రియుడు విశాల్ నటించిన ‘పందెంకోడి 2’లో ప్రతినాయకురాలిగా నటించింది. ఈ చిత్రం అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మురగదాస్-విజయ్ ల ‘సర్కార్’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవీగాక, ‘మారి 2’, ‘శక్తి’, ‘వెల్వేట్ నగరం’, ‘నీయ 2’ తదితర సినిమాల్లో వరలక్ష్మి నటిస్తున్నారు.