‘అరవింద సమేత’ పబ్లిక్ టాక్
తారక్ – త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రాబోతుందని అని తెలినప్పటి నుంచి ఒకటే చర్చ. అసలు సినిమా ఎలా ఉండబోతుంది. త్రివిక్రమ్ చేతుల్లో తారక్ ఎంత పవర్ ఫుల్లుగా ఉండబోతున్నాడు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తారక్ నోటితో చెబితే చూడాలి. తారక్ మార్క్ యాక్షన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా సమయం వచ్చేసింది.
దసరా కానుకగా అరవింద సమేత ఇవాళ (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఉదయం పూట ఆట పడిపోయింది. పబ్లిక్ టాక్ కూడా బయటికొచ్చింది. ఈ సారి త్రివిక్రమ్ కాస్త కొత్తగా మొదలెట్టాడు. సునీల్ జరిగిన కథ ను వివరిస్తున్న సందర్భంతో సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత జగపతి బాబు , నాగ బాబు ల వర్గాల మధ్య ఫ్యాక్షన్ సన్నివేశాలు చూపించాడు. ఆ వెంటనే జగపతి బాబు కొడుకుగా నవీన్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు. ఇక, తారక్ వీర రాఘవుడి గా చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
రెండు అదిరిపోయే యాక్షన్ ఏపీసోడ్స్, కుటుంబ సభ్యుల పరిచయం, వారి నేపథ్యం. వారి మధ్య ఫన్నీ సన్నివేశాలు. ఒకట్రెండు ట్విస్టులతో ఫస్టాఫ్ సాగింది. త్రివిక్రమ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, తారన్ అద్భుతమైన నటన, పూజా గ్లామర్, థమన్ నేపథ్య సంగీతం ఫస్టాఫ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక, సెకాంఢాఫ్ లో తారక్-పూజల మధ్య అర్థవంతమైన చర్చతో.. కథ మరో టర్న్ తీసుకొంది. వీర రాఘవుడు శాంతి బాటపట్టినట్టు. ఆ తర్వాత తారక్-రావు రమేష్ ల ఏపీసోడ్, పినిమిటి సాంగ్, మరో ట్విస్టు, ఓ యాక్షన్ ఏపీసోడ్ తో త్రివిక్రమ్ తనదైన శైలిలో ముగించాడు. మొత్తంగా అరవింద సమేత అదిరిపోయిందని పబ్లిక్ టాక్.