మాస్ అంటే ఇదిరా.. !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో ఇప్పుడు థియేటర్స్ దగ్గర పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. ‘అరవింద సమేత’ విడుదల నేపథ్యంలో నందమూరి అభిమానులు పండగ చేసుకొంటున్నారు. అభిమాన నటుడి హోర్డింగ్స్, కటౌట్స్ తో థియేటర్స్ ని ముస్తాబు చేశారు. ఏలూరులో బెల్లారి ఫ్యాన్స్ ఏకంగా ఎన్టీఆర్ కటౌట్ ని రథంపై ఊరేగించారు. మాస్ అంటే ఇదేరా.. ! దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ రంగంలోకి దిగడానికి బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ గ్రూగులు అరవింద సమేతని ఫుల్లుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల బాబాయ్-అబ్బాయ్ ల మధ్య అంతరం తగ్గింది. దీంతో నందమూరి అభిమానుల్లో మరింత జోష్ కనిపిస్తోంది. మొత్తంగా.. థియేటర్స్ బయట అభిమానుల అరాచకం, థియేటర్స్ లో అరవింద అరాచకం కొనసాగుతున్నాయి.