బ్రేకింగ్ : మెట్రో రైల్ మధ్యలోనే ఆగిపోయింది

హైదరాబాద్ లో మెట్రో రైల్ పరుగులు మొదలైన సంగతి తెలిసిందే. ఐతే, మొదటిసారి మెట్రో రైల్ మధ్యలోనే నిలిచిపోవడం హాట్ టాపిక్ గా మారింది. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వెళ్తున్న రైలు సాంకేతిక లోపం వలన కూకట్‌పల్లి బాలానగర్‌ మెట్రోస్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఐతే, వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఆ మరమ్మతులు పూర్తయ్యేవరకూ మియాపూర్‌ నుంచి బాలానగర్‌ వరకూ మెట్రోరైలు సేవలను నిలిపివేశారు. ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వరకూ రైళ్లు నడవనున్నట్లు తెలిపారు.