అమితాబ్ కూడా వేధించాడట !
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తక్కువోడు ఏమీ కాదా.. ? ఆయన కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా ?? అంటే అవుననే అంటోంది ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీ. ప్రస్తుతం #మీటూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా మారింది. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు. వివిధ రంగాలకు విస్తరిస్తోంది. రాజకీయ, కార్పోరేటు, క్రీడారంగంలోనూ.. లైంగిక వేధింపులు ఉన్నాయనే విషయం వెలుగులోకి వస్తోంది. దీంతో దీనిపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు తెరలేచింది.
మరోవైపు, ఈ ఉద్యమంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ #మీటూ ఉద్యమంపై స్పందించారు. ‘మహిళలతో మర్యాదగా, గౌరవంగా ఎలా ప్రవర్తించాలో ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అలా చేయని వారికి అన్ని రంగాల్లో దారులు మూసుకుపోతుండటం సంతోషకరమైన విషయం. ఇప్పటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే నిజాన్ని గట్టిగా, నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా #మీటూపై స్పందించారు. ‘మహిళలకు ఇటువంటి వేదింపులు ఎదురైతే నిందితుడిని వెంటనే శిక్షించాలి. మహిళలపై వేదింపులు చూస్తే మనస్సు కలిచివేస్తంది. వారికి రక్షణ ఇవ్వకపోతే దేశంపై చెరపేసుకోలేని మచ్చపడుతుంది’ అని బిగ్ బీ ట్విట్ చేశారు. ఐతే, బిగ్ బీ ట్విట్ పై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీ సంచలన కామెంట్స్ చేసింది.
అమితాబ్ వ్యాఖ్యలు అబద్ధం. త్వరలోనే ఆయనకు ఉన్న సామాజికవేత్త అన్న పేరు కూడా పోతుంది. అమితాబ్ నిజాలు త్వరలో బయటకువస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు… ‘‘నా ట్వాట్ చేసి కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారని, ఎందుకంటే కొరుక్కోవడానికి మీకు ఉన్న గోర్లు సరిపోవు కదా’’ అని ఆమె అమితాబ్ బచ్చన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు సప్నా. దీంతో అమితాబ్ కూడా మహిళలని వేధించాడనే విషయం అర్థవుతోంది. ఐతే, అది ఎవరిని ? ఎప్పుడు అనేది త్వరలోనే సప్నా తెలపనుంది.